15-07-2025 06:22:44 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): పీర్జాది గూడ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని మాజీ మేయర్ అమర్ సింగ్ అధికారులను ఆదేశించారు. పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మాజీ కార్పొరేటర్లతో కలిసి ఆయన పరిశీలించారు. 26 డివిజన్ మాజీ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు పనులను, ఐదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడిగె స్వాతి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ఎన్డీపీ పనుల పురోగతిని పరిశీలించారు.
ప్రజలకు సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యమైన పనులు చేపట్టాలని అధికారులను మాజీ మేయర్ ఆదేశించారు. పైప్ లైన్ పనుల వలన స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగ కలుగుతుందని ముఖ్యంగా వర్షాకాలంలో మురుగు నీటి ఉధృతిని నియంత్రించడం సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, బండి శ్రీనివాస్, హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ వంగూరి పరమేష్, తావిటి ప్రశాంత్, మణిరాం నాయక్, కాలనీవాసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..