15-07-2025 06:17:23 PM
ఆయుధాలు వీడండి-జనజీవన స్రవంతిలోకి రండి
గుత్తికోయ గుడాలలో వెలిసిన కరపత్రాలు
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని పలు గుత్తికోయా గూడాలలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మావోయిస్టులకు వ్యతిరేకంగా మావోయిస్టుల పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఇందులో భాగంగా మావోలకు వ్యతిరేకంగా ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరు మీద ములుగు జిల్లా మావోయిస్టుల సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా, అక్కల్లారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి అశాకిరణం ఎన్నడైంది? మీకు ఎదురైన సవాళ్లు, తద్వారా వచ్చే పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మ సంతృప్తిని మిగిల్చిందేంది.
ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న మీ 40ఏండ్లనాటి ఉద్యమ బాట ప్రజాధరణ లేక మోడువారిన బీడు భూమిలాగా అయ్యింది. మావోయిస్టు అగ్ర నాయకుల్లారా ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి, కాలానుగుణంగా మారిన ప్రజల జీవన విధానంలో పాత్రులు కండి అడవిని వీడి ప్రజల్లోకి రండి ప్రజాస్వామ్య గొంతుక కండి! ఆయుధాలు మనకొద్దు ప్రజామోద మార్గమే మనకు ముద్దు ఆయుధాలు వీడండి-జనజీవన స్రవంతిలోకి రండి! మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండని పోస్టర్ లో సూచించారు.