calender_icon.png 16 July, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున సాగ‌ర్‌కు తగ్గిన వరద

15-07-2025 06:46:00 PM

ఈ నెల 8న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను తెరిచి దిగువకు నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలంకు తగ్గిన వరద ప్రవాహం

శ్రీశైలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 882.50

తగ్గిన వరద ప్రవాహం .. శ్రీశైలం గేట్లు మూసివేత

కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,753 క్యూసెక్కులు నాగార్జునసాగర్ కు విడుదల

సాగర్‌ 557 అడుగులు దాటిన నీటిమట్టం

నాగార్జునసాగర్ నిండేది ఎప్పుడు?

నాగార్జునసాగర్,(విజయక్రాంతి): మూడు రోజుల పాటు కనువిందు చేసిన శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి గత పది రోజులుగా కొనసాగిన వరద ప్రవాహం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుండి శ్రీశైలం జలాశయానికి 65,985 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద తగ్గుముఖం పట్టటంతో శ్రీశైలంకు ఇన్‌ఫ్లో తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,753 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులుగా నమోదైంది.

గత వారం సుంకేసుల, జూరాల నుంచి నిత్యం లక్షకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 8న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో డ్యామ్ అధికారులు గేట్లను తెరిచిన విషయం విదితమే. అయితే, గత నాలుగు రోజులుగా వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లు మూసివేశారు. 

నాగార్జునసాగర్ నిండేది ఎప్పుడు..?

అటు నాగార్జునసాగర్ జలయాశంలోకి ఎగువ నుంచి వస్తున్నవరద నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ లోకి 63900 కౄౄసెక్కల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 557 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 223 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నుంచి హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీ ద్వారా 1,650 కౄసెక్కల నీరు విడుదల చేస్తున్నారు. జల విద్యత్ కేంద్రంలో విద్యత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో ఇప్పట్లో సాగర్ నిండే అవకాశం కనిపించడం లేదు.