15-07-2025 05:56:24 PM
మధిర,(విజయక్రాంతి): మధిర మండలం రాయపట్నం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లకు నాయకులు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, ఏఎంసి డైరెక్టర్ అద్దంకి రవికుమార్ మాట్లాడుతూ... ఆనాడు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో అనేకమంది ఇల్లు లేని సమస్యను భట్టి విక్రమార్క కు తెలపగా ఆనాటి హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం నేడు అమలపరుస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉందని అన్నారు.