16 April, 2026 | 11:59 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

108 కలశాలతో అభయాంజనేయ వార్షికోత్సవం

13-04-2025 09:47 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని స్వప్నలోక్ కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ, యజ్ఞం సంపత్ కుమార్ శర్మ, అర్చకులు సతీష్ పాండే, అజయ్ పాండే, సాయికుమార్ శర్మ, ల ఆధ్వర్యంలో ఆలయంలో విశేష పూజలు యజ్ఞ హోమం ,పూర్ణాహుతి, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. 108 కలశలతో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ  గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కాలనీ పేరే స్వప్నలోక్ అని పేరు పెట్టుకోవడం చాలా అద్భుతంగా ఉందని, సంవత్సరం కాలంలోనే ఎంతో అత్యంత వైభవంగా నిర్మాణం అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా, కాలనీవాసు ఇల్లు వేద పండితులు బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ శాలువాతో సన్మానించారు. పోయేటప్పుడు మన వెంట ఏమి తిసుక వెళ్ళలేమని ఉన్నన్ని రోజులు  బాగుండాలని, తోచిన కాడికి సహాయం చేస్తూ అందరితో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. అంతేకాకుండా మన పిల్లలకు మంచి మాటలు మంచి బుద్దులు నేర్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఎస్పీఆర్ స్కూల్ యజమాన్యం ప్రతినిధి కొమ్మిరెడ్డి మారుతి, ఆలయ కమిటీ అధ్యక్షులు పవన్ కుమార్ శర్మ, కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రమాశంకర్, కోశాధికారి సతీష్ ,సభ్యులు డాక్టర్ హరీష్, నవీన్, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.