13-04-2025 09:51:46 PM
సీఎం సమీక్షతో అలర్ట్ అయిన ఎక్సైజ్ అధికారులు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోకృత్తిమ కల్తీకల్లును అరికట్టడంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణాల్లో డిపోల్లో ఆదివారం కల్లు షాంపిల్స్ను సేకరించడం వేగవంతం చేశారు. జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది అప్రమత్తమైంది. టి ఎఫ్ టి లేని కల్లు దుకాణాలు మూసి ఉంచారు. ఎల్లారెడ్డి, దోమకొండ, బాన్సువాడ, సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో అన్ని కల్లు దుకాణాల్లో శాంపిల్స్ను సేకరించడం జరుగుతుంది. మూడు రోజుల క్రితం జిల్లాలో 100 మంది కి పైగా కృత్రిమ కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించడంఎక్సైజ్ అధికారులు ప్రాణ నష్టం జరగకుండా చూశారు. కృత్తిమ కల్తీకల్లు నివారించడానికి తగు చర్యలు తక్షణమే చేపట్టాలని శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
దీంతో ఎక్సైజ్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కృత్రిమ కల్తీ కల్లు పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. అవసరమైతే పీడి యాక్ట్ కింద కేసులు నమోదుచేసి కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖలోని ఎన్ఫోర్స్మెంటు టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తృతంగా కల్లు దుకాణాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్సైజ్ విభాగంలో ఉన్న మూడు విభాగాల అధికారులు జిల్లాలోని అన్ని కల్తీకల్లు దుకాణాలను తనిఖీలు నిర్వహించి శాంపిల్ సేకరించి ల్యాబ్ లకు పంపాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో రెండు మూడు కేసులు నమోదైన వారిపై నార్త్తోడ్రక్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని, అవసరమైతే స్థానికపోలీసు అధికారుల సహకారం తీసుకొని కృత్తిమ కల్తీకల్లు ను నివారించడానికి అన్ని రకాల చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.
గత కొన్ని సంవత్సరాలుగా రాజంపేట కళ్ళు డిపో లైసెన్స్ లేకుండా నడుస్తుండేది. అయితే శనివారం దోమకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కల్లు డిపోకు సీల్ వేయడం జరిగింది. ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని దోమకొండ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. ఏళ్ల తరబడి కల్లు డిపోకు లైసెన్స్ లేకుండా నడవడం పట్ల ఎక్సైజ్ అధికారుల పనితీరు పలు అనుమానాలకు దారితీస్తుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు అంటేనే ప్రజల్లో ఒక రకమైన భావన ఉంది. కృత్తిమ కల్తీకల్లు వీరి కనుసన్నా ల్లోనే నడు స్థాయిఅనే ఆరోపణలు ఉన్నాయి. బాన్సువాడ సర్కిల్ ప్రాంతంలో కృత్రిమ కల్తీకల్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ దండాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. కళ్ళు దుకాణాలు నడుపుతున్న వారితో సమీక్ష సమావేశాలు నిర్వహించి సాధ్యమైనంత తొందరలోనే కల్తీ కల్లుకు బ్రేక్ వేయడం జరుగుతుందని ఎక్సైజ్ సూపర్డెంట్ విజయక్రాంతి ప్రతినిధి తో మాట్లాడుతూ అన్నారు.