calender_icon.png 5 August, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుణుడి కోసం 1001బిందెలతో అభిషేకం

05-08-2025 01:15:35 AM

అలంపూర్ ,ఆగస్టు 4 :ఈ ఏడాది ముందస్తుగా మురిపించిన వరుణుడు ఆ తర్వాత ము ఖం చాటేసాడు. వర్షాలు లేక అన్నదాతల ముఖముల్లో నైర్యాశాన్ని నింపాడు. వానదేవుడు క రుణ కోసం ఊరి దేవుళ్లకు జలాభిషేకాలు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం శ్రావణమా సం కావడంతో గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు గ్రామస్తులంతా ఏకమై వరుణుడి రాక కోసం శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి 1001 బిందెలతో అభిషేకాలు చేశారు.

రై తులు మహిళలు గ్రామ ప్రజలంతా కలిసి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శివుడికి జల అభిషేకాలు చేయడంవల్ల సకాలంలో వర్షాలు కురిస్తాయని గ్రామస్తుల నమ్మకం అనంతరం గ్రామంలో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.