calender_icon.png 5 August, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

05-08-2025 01:15:24 AM

గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సింహులు

తాండూరు, ఆగస్టు- 4 (విజయక్రాంతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తుందని వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం తట్టేపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నర్సింలు అన్నారు.

సోమవారం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారి ఇళ్ళ నిర్మాణం పనులను మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో మొదటి విడత లో గ్రామానికి 35 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని మరో విడతల్లో మరిన్ని ఇందిరమ్మ ఇల్లు మంజులవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు పాల్గొన్నారు.