రిజర్వేషన్ల రద్దు ఎవరి తరం కాదు!
బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్, మే 10 (విజయక్రాంతి): రిజర్వేషన్ల రద్దు ఎవరి తరం కాదని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు. కరీంనగర్‌లో ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయనకు పలు దళిత సంఘాలకు చెందిన నాయకులు మద్ద తు తెలిపారు. ఈ సందర్భంగా వినోద్‌కుమా ర్ మాట్లాడుతూ.. 2001లో ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో బీఆర్‌ఎస్ ఆవిర్భవించిందని, 14 ఏళ్ల పోరాటం తర్వాత స్వరా ష్ట్రం సిద్దించిందన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ ద్వారా తెలంగాణ కల సాకారమైం దన్నారు. అంబేద్కర్‌కు కృతజ్ఞతగా నాటి సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ వస్తే ఎసీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు అవుతాయని, బీజేపీ నేతలు కాంగ్రెస్ వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసి ముస్లింలకు ఇస్తారని పచ్చి అబద్ధాలు మాట్లాడు తున్నారన్నారు.
నిజానికి రిజర్వేషన్లు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆ రెండు పార్టీల తప్పిదాలు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల పక్షాన పోరాటం చేస్తానన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి లోక్‌సభలో గొంతుకనవుతాయనన్నారు. వివిధ దళిత సంఘాల మేడి మహేష్, వంతడ్పుల సంపత్, కొమురయ్య, ప్రభాకర్, బీమారపు సతీష్, జలపతి పాల్గొన్నారు.






