calender_icon.png 26 October, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కాలర్షిప్ ప్రభుత్వ బిక్ష కాదు.. విద్యార్థుల హక్కు

25-10-2025 06:35:18 PM

ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..

నల్గొండ టౌన్: స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఏబీవీపీ విదార్థులతో క్లాక్ టవర్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను శనివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న గత 3 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8500 కోట్ల విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.

స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవటం వలన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కళాశాలలను మూసుకునే దుస్థితి దాపురించిందని, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వం విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు సర్టిఫికెట్స్ జారీ చేయటం లేదని ఫలితంగా విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించటం లేదని, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వ బిక్ష కాదని విద్యార్థుల హక్కు అని వెంటనే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే ఎబివిపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా విద్యార్థుల పక్షాన భారీ స్థాయి ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి స్టేట్ యూనివర్సిటీస్ కో కన్వీనర్ మౌనేశ్వర్ చారి, శివ, మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.