calender_icon.png 26 October, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనో వికాస్ పాఠశాలలో పుట్టిన రోజు వేడుకలు

25-10-2025 06:37:16 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో గల మనోవికాస్ పాఠశాలలో గుండేటి శివరాం ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన గుండేటి అంబదాస్ - లత దంపతుల కుమారుడు శివరాం ప్రసాద్ ఎనిమిదవ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని మనోవికాస్  పాఠశాల పిల్లల సమక్షంలో కేకును కట్ చేశారు. అనంతరం పిల్లలకు పండ్లు, బ్రెడ్, నోట్ బుక్స్, పెన్ను లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడి జన్మదిన వేడుకలు మనోవికాస్ పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు సురేఖ, చిన్నారి బంధువులు వైష్ణవి, ఆడేపు అశోక్ కుమార్, సరోజన లుపాల్గొన్నారు.