calender_icon.png 20 September, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ వర్సిటీ ఎన్నికలో ఏబీవీపీ జయకేతనం

20-09-2025 12:51:03 AM

  1. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో విజయభేరి
  2.   3 పోస్టులు కైవసం చేసుకున్న ఏబీవీపీ, 1 పోస్టు గెలిచిన ఎన్‌ఎస్‌యూఐ 
  3. జెన్ జడ్ మద్దతు మోదీకే!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎ స్‌యూ)కి జరిగిన ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయఢంకా మోగించింది. భారీ భద్రత నడుమ జరిగిన ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఏబీవీపీ తరఫున ఆర్యన్‌మాన్ అధ్యక్ష పదవిని గెలుచుకున్నాడు. కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌ఎస్ యూఐ తరఫున నందిత చౌధరి పోటీ చేశారు. వామపక్షాలకు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ తరఫున అంజలి పోటీలో నిలిచి మూడో స్థానం కైవసం చేసుకుంది.

ఏబీవీపీకి చెం దిన ఆర్యన్ మాన్‌కు 28,821, ఎన్‌ఎస్‌యూ అభ్యర్థి నందితకు 12,645 ఓట్లు, ఎస్‌ఎఫ్‌ఐ తరఫున పోటీచేసిన అంజలికి 5,385 ఓట్లు పోలయ్యాయి. యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ గెలవడంపై అమిత్ షాతో సహా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

స్టూడెంట్ యూనియన్ ఎన్నికల గెలుపుతో జెన్ జడ్ వర్గం మోదీకే మద్దతుగా ఉందని మరోసారి రుజువైంది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎస్ యూఐ అధ్యక్ష పదవిని దక్కించుకోగా.. ఏబీవీపీ ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్నాయి. అధ్యక్షుడిగా ఏబీవీపీ అభ్యర్థి గెలవగా.. ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్ష పదవిని ఎన్‌ఎస్ యూఐ గెలుచుకుంది. రాహుల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.