పన్నా మహిళకు జాక్‌పాట్
వారం వ్యవధిలో దొరికిన ఎనిమిది డైమండ్లు
భోపాల్, సెప్టెంబర్ 19: వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో మ మారు వజ్రాలు దొరికాయి. ఇప్పటికే వజ్రా లు దొరకడంతో అనేక మంది లక్షాధికారులుగా మారారు. ప్రస్తుతం ఈ అదృష్టం ఓ మహిళా కూలీకి వరించింది. బెంగాల్‌కు చెందిన రచనా గోల్డార్ అనే మహిళకు వారం రోజుల వ్యవధిలోనే ఎనిమిది వజ్రాలు దొరికాయి. ఆ మహిళకు దొరికిన వజ్రాలు ఒక్కో టి రూ. 4-5 లక్షలు ఉండే అవకాశం ఉంది.
డైమండ్స్ ప్రభుత్వ డైమండ్ ఆఫీస్‌లో ఉన్నా యి. వాటిని అధికారులు త్వరలోనే వేలం వే యనున్నారు. మొత్తం ఎనిమిది వజ్రాలు కలిపి 2.53 క్యారెట్ల బరువున్నాయి. ఆరు డైమండ్లు నగలలో ఉపయోగించే శుద్ధమైనవి కాగా.. మరో రెండు పరిశ్రమల్లో వాడేం దుకు ఉపయోగిస్తారు.
డైమండ్స్ దొరికిన ర చనా బడ్గలి గ్రామంలో నివసిస్తున్నారు. ఆ మెకు ముగ్గురు పిల్లలు ఉండగా.. అందులో ఇద్దరు కొడుకులు ప్రైవే టు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ మహిళ అల్లుడు కూడా డైమండ్ గనిలోనే ఉద్యోగం చేస్తాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బులో 11 శాతం రాయల్టీ, 1 శాతం టీడీఎస్ కింద మొత్తం 12 శాతం ప్రభుత్వం తీసుకుంటుంది.




