16-07-2025 11:50:07 AM
కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని(Kamareddy district) ఆర్టిఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ(ACB raids) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న ఆర్టిఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించారు. ఒకవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతుండగా లారీలు ఆపి డ్రైవర్ లు చెక్పోస్ట్ వద్దకు వచ్చి యధావిధిగా మామూలు ఇవ్వడం ఏసీబీ అధికారుల కంటపడ్డాయి. ఒక వాహనానికి 500 చొప్పున మామూలుగా ఏసీబీ అధికారులు నివ్వెర పోయేలా చేశాయి. ఒకవైపు ఏసీబీ దాడులు కొనసాగుతున్న విషయం దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లకు తెలియక మామూలు ఇచ్చే వారు వాహనాలను ఆపి వాహనానికి 500 చొప్పున ఇవ్వడం చూస్తుంటే ప్రతిరోజు జంగంపల్లి ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ఏ స్థాయిలో మామూలు వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లా తో పాటు నల్గొండతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.