16-07-2025 07:52:11 PM
కోదాడ: మెప్మా మహిళా సంఘాల సంక్షేమం కోసం ఆర్థికంగా బలోపేతం కావాలని మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా 100రోజుల ప్రణాళికను బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... మూడు రోజులు జరిగే సంఘాల మేళ, విధి వ్యాపారస్తులు తయారు చేసే వివిధ రకాల పదార్థాల కార్యక్రమాన్ని పట్టణ ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళ సంఘాలు బాలోపేతం కొరకు కృషి చేయాలన్నారు. అనంతరం పిడి మెప్మా రేణుక మాట్లాడుతూ... మెప్మా ఆధ్వర్యంలో సంఘం మహిళలే స్వయంగా తయారుచేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారని తెలిపారు.