16-07-2025 07:40:17 PM
నూతనకల్,(విజయక్రాంతి): సైబర్ నేరాలపై విద్యార్థినీలు అవగాహన పెంచుకోవాలని, ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీంలకు సమాచారం అందించాలని తుంగతుర్తి సీఐ నరసింహారావు అన్నారు. సైబర్ నేరాలు షీ టీమ్ లపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని గుండ్ల సింగారం లోని కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థినిలు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలల సాకారం చేయాలని సూచించారు. మహిళలకు విద్యార్థినులకు షి టీంలు ఏర్పాటు చేశామని ఏదైనా ఆపద వస్తే 100 నెంబర్ కు డయల్ చేయాలని సూచించారు. ఎవరైనా మోసాలకు గురైతే 1930 నెంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్, కేజీబీవీ పాఠశాల విద్యార్థులు తదితరులున్నారు.