16-07-2025 08:11:40 PM
మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవంలో ప్రిన్సిపల్ సయ్యద్ సలీం
మంథని,(విజయక్రాంతి): ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యను అందించడమే లక్ష్యమని మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవంలో ప్రిన్సిపల్ సయ్యద్ సలీం తెలిపారు. బుధవారం కళాశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ... విద్యార్థిలో నైపుణ్యాన్ని పెంచేందుకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా అకాడమిక్ ఇయర్ లో భాగంగా వీటిని ప్రారంభించామని, సైన్స్ గ్రూపు సంబంధించి నీట్, ఏప్సెట్ తరగతులు, ఆర్ట్స్ గ్రూపు సంబంధించి క్లాట్, సిఏ ఫౌండేషన్ తరగతులను బోధిస్తామని, రోజువారీగా జరిగే తరగతులతో పాటు డిజిటల్ క్లాస్ లు నిర్వహిస్తామని, డిజిటల్ క్లాసులను ప్రారంభించడం పట్ల విద్యార్థినులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యను అందించడమే లక్ష్యంగా బోర్డు ఉన్నట్లు ప్రిన్సిపల్ సయ్యద్ సలీం తెలిపారు.