16-07-2025 11:51:50 AM
వరంగల్,(విజయక్రాంతి): టీజీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ లో పాల్గొంటున్న అభ్యర్థుల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో(Government Zilla Parishad School), నవోదయ, గురుకులాల్లో చదివి ఉంటే వారికి పూర్తిగా ట్యూషన్ ఫీజు రాయితీ కల్పిస్తున్నట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం పాలీసెట్ అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 18 లోపు ప్రభుత్వ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్ లైన్ సెంటర్ ను సందర్శించి తమ వివరాలను నవీకరించుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ఆధారంగా వారి దరఖాస్తులను పరిశీలించి ట్యూషన్ ఫీజు రాయితీ పథకానికి ఎంపిక చేస్తామని చెప్పారు.