calender_icon.png 17 July, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీగాదలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

16-07-2025 07:34:24 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): గంభీరావుపేట మండలంలోని శ్రీగాద గ్రామంలో ఐదుగురు లబ్ధిదారులకు రూ.1,72,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ... సిఎం సహాయనిధి నిరుపేదలకు ఒక  వరం అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందన్నారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.