16-07-2025 07:55:41 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ డిపో నుండి పుణ్య క్షేత్రలకు విహార యాత్రలకు బస్సులు నడుపుతున్నారు. దానిలో భాగంగా ఈ రోజు నిర్మల్ బస్టాండ్ నుండి అరుణాచలం, పలని, రామేశ్వరం, శ్రీరంగం సూపర్ లగ్జరి బస్సు బయలుదేరినట్లు డిపో మేనేజరు కే.పండరి తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రలకు విహర యత్రలకు మీరు కోరుకున్న చోటికి బస్సులు నడుపుతామని ఆయన తెలిపారు.అరుణాచలం నికి ఇంతకు ముందు చాలా సార్లు వెళ్లి వచ్చిందని ఇప్పుడు ప్రయాణికుల కోరిక మేరకు మళ్ళీ ట్రిప్ వేశామని, త్వరలో ప్రయాగ్ రాజ్, కాశీ, అయోధ్య, యాదగిరిగుట్ట, స్వర్నగిరి, పండరిపూర్ బస్సులు నడుపుతామని 30 మంది ప్రయనికులు ఉంటే మీ గ్రామానికే బస్సు పంపుతామని డిపోమేనేజర్ తెలిపారు. మరిన్నివివరాలకు 9959226003,83280 21517, 7382842582 లో సంప్రదించాలని ఆయన తెలిపారు.