16-07-2025 08:17:04 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): రేచినీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భట్టారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం సంఘ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలువురు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు రాష్ట్రోపాధ్యాయ సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భట్టారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(State Teachers' Association) విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల సాధనకై 75 సంవత్సరాలుగా అలుపెరగని కృషి చేస్తుందని తెలిపారు.
ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ పారదర్శకంగా చేయాలని, పాఠశాల స్థాయిలో కాంప్లెక్ ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయిలో మండల విద్యాధికారులు, జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి ఉపాధ్యాయుల వృత్తిపరమైన పనులను వెంటనే పూర్తిచేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఎలను, పీఆర్సీను వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ,స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.