16-07-2025 08:07:35 PM
నిర్మల్,(విజయక్రాంతి): మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆషాఢ మాస సందర్భంగా "గోరింటాకు పండుగ" ఉత్సవాలను ఘనంగా బుధవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ ఉపాధ్యాయులు, విద్యార్థులకు గోరింటాకు పెట్టీ అందరిలో నూతన ఉత్సాహన్ని నింపారు. ఈ సందర్భంగా ఆమె గోరింటాకు ప్రాముఖ్యతను వివరిస్తూ ఇది వర్షాకాలంలో వచ్చే చర్మవ్యాధుల నుంచి కాపాడుతుందని, స్త్రీలకు అలంకరణలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.