calender_icon.png 17 July, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాశాలలో మౌలిక వసతులను కల్పించాలి

16-07-2025 08:03:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్ కళాశాలలలో మౌలిక వసతులు కల్పించేందుకు నిర్వహించిన సమీక్షా సమావేశం కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు, మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాల్లో మొత్తం 13 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయని, 2417 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మెరుగైన విద్య బోధనతో పాటు అవసరం ఉన్న కళాశాలల్లో పైకప్పుల లీకేజీలు, మరమ్మత్తులు, అదనపు మరుగుదొడ్లు, ఫ్లోరింగ్, ఆర్. ఓ ప్లాంట్, తలుపులు, కిటికీలు తదితర అంశాలపై సంబంధిత అధికారులు నివేదిక అందజేయాలని సూచించారు. అవసరమైన చోట ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా పనులు చేపట్టాలని, దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలన్నారు.