10-08-2024 12:32:07 PM
నిజామాబాద్: మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. శనివారం మరికొన్ని బ్యాంక్ లాకర్లను అధికారులు ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఏసీబీ తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్ల 7 లక్షల విలువైన ఆస్తులు గుర్తించారు. ఇంట్లో రూ. 2 కోట్ల 93 లక్షల 81 వేల నగదు పుట్టుబడింది. కుటుంబ సభ్యుల ఖాతాల్లో రూ.కోటి 10 లక్షల నగదు, అరకిలో బంగారు నగలు, 17 స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్న నిజామాబాద్ మునిసిపల్ రెవెన్యూ విభాగం ఇన్‌చార్జి సూపరింటెండెంట్ దాసరి నరేందర్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.