10-08-2024 12:47:17 PM
హైదరాబాద్: సుప్రీం కోర్టు ధర్మాసనంలోని ప్రతి న్యాయమూర్తికి మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోడీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. వర్గీకరణ సాకారం కావడంతో మోడీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రధాని మోడీ, కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అమలు చేయడంలో రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాలు త్వరగా అమలు చేసేలా కేంద్రం సంప్రదింపులు జరపాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును దక్షిణాదిలో నలుగురు సీఎంలు వెంటనే స్వాగతించారని మందకృష్ణ తెలిపారు.