02-05-2025 08:08:16 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూంల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోళ్ల పేర్లను లబ్దిదారుల జాబితాలోకి చేర్చి లేనోళ్లకు మొండిచెయ్యి చూపిస్తున్నారని మాజీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తంచేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాబితాలో కాంగ్రెస్ నాయకులు అవకతవకలు చేశారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం జిల్లా పాలన అధికారి కుమార్ దీపక్ కి ఫిర్యాదు చేశారు. అధికారులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు అర్హులైన నిరుపేదల పేర్లను తొలిగించి ఆన్ లైన్ లో పేర్లను నమోదు చేసుకొని వారి పేర్లను చేర్చడం,ఆర్థికంగా ముందు ఉన్నవారి పేర్లను లబ్దిదారుల జాబితాలోకి చేర్చడం జరిగిందని తెలిపారు.లబ్దిదారుల జాబితాల్లో జరిగిన అవకతవకలపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని,అలాగే రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్ రూములను కేటాయించాలని నియోజకవర్గ ఇంచార్జ్ రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో రామిడి కుమార్, రెవెళ్లి ఓదేలు, అరుణ్, మని, శివ వున్నారు.