calender_icon.png 3 May, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ దే: మాజీ మంత్రి రామన్న

02-05-2025 07:58:09 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆలయాల నిర్మాణాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసి ప్రభుత్వ నిధులతో ఆలయాలు నిర్మించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని మాజీ మంత్రి రామన్న పేర్కొన్నారు. జైనథ్ మండలం, కరంజి గ్రామంలో నూతన ఆలయంలో నంద మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు నిర్మించనన్ని వివిధ ఆలయాల నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామ దేవతల ప్రాధాన్యత ఎంతో విలువైందన్నారు. అంటు వ్యాధులు దరిచేరకుండా గ్రామ దేవతలు కాపాడతాయని దృఢమైన నమ్మకంతో పూజించడం జరుగుతుందని తెలిపారు. నాయకులు మారిశెట్టి గోవర్ధన్, మహేందర్ రెడ్డి, బిక్కి రవీందర్, గంగన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.