08-07-2025 01:42:54 AM
సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి
కరీంనగర్ క్రైం, జూలై 7 (విజయ క్రాంతి): కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులతో వి చారణ జరిపించాలని సిపిఐ నగ ర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ నగర కార్యవర్గ సమావేశం న్యాలపట్ల రాజు అధ్యక్షతన బద్దంఎల్లారెడ్డి భవన్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నగర మాజీ మేయర్ సునీల్ రావు పదవీకాలంలో స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి రా జ్యమేలిందని, కోట్ల రూపాయలు నీటిపాలు అయ్యాయని, సునీల్ రావు టిఆర్‌ఎస్ పార్టీలో ఉ న్నంతకాలం అవినీతి నోరు మెదపలేదని బిజెపిలో చేరి అవినీతి జరిగిందని చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికలకు సీపీఐ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ జెండాను కార్పొరేషన్ పై ఎగరేసేందుకుప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కొట్టి అంజలి, నగర కార్యవర్గ సభ్యులు గామినేని సత్తయ్య, కసి బోసుల సంతోష్ చారి, నునావతు శ్రీనివాస్, నగు నూరి రమేష్, ఎస్. రాజు తదితరులుపాల్గొన్నారు.