పెన్ పహాడ్ : నిరు పేదలకు గూడు కల్పించాలానే సకల్పంతో రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టిందందని అందులో భాగంగానే గూడు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందించడం శుభపరిణామని కాంగ్రెస్ మండలాధ్యక్షులు తూముల సురేష్ రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని గాజుల మొల్కాపురం గ్రామంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పక్కా ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో నిరుపేదల కుటుంబాలు బజారున పడ్డారన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి స్వీట్లు పంచుకొని ఆనందోత్సవాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి ధనమ్మ రామకృష్ణారెడ్డి, సమ్మక్క సారలమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ నాతాల వెంకటరెడ్డి, మాజీ వార్డ్ మెంబర్. బొల్లికొండ వీరస్వామి ఎస్.కె జాన్మియా ,బండి మసుధన్ రెడ్డి, బండి శ్రీ రామ్ రెడ్డి,ఎస్.కె ఇమామ్ పాషా, వెంకన్న, శోభన్ బాబు, సైదులు, లింగయ్య, హౌసింగ్ ఏఈ, నాగరాజు. గ్రామ కార్యదర్శి అనిల్ , కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.