calender_icon.png 25 September, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌతమీ కాలేజీలో బతుకమ్మ వేడుకలు

25-09-2025 08:34:10 AM

హనుమకొండ,(విజయక్రాంతి): భీమారంలో గల గౌతమీ జూనియర్ కళాశాల బతుకమ్మ వేడుకలను ఏంటిఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల అనంతరం జూనియర్, సీనియర్ విద్యార్థులకు పరిచయ కార్యక్రమం కొనసాగించారు. అనంతరం సంస్థ డైరెక్టర్ ఎ .శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసమై, నిరంతరం పాటుపడి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఉన్నతమైన, విద్యా ప్రమాణాలతో కళాశాలను ఏర్పాటు చేశామని, మంచి నైపుణ్యం గల అధ్యాపకుల చేత బోధన జరుగుతుందని విద్యార్థిని,విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ బిక్షపతి గారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఆశయాలతో నిరంతరం శ్రమించి నప్పుడే, తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నిలబెడతారని, అందుకోసం కష్టపడి కాకుండా ఇష్టపడి, నిరంతరం శ్రమించాలన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు కేరింతల నడుమ నిర్వహించారు. అనంతరం కళాశాల సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు లక్ష్మణ్,పరుష రాములు,ధనుంజయ,అధ్యాపకులు రాజు,రాజకుమార్,టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.