21-07-2025 10:06:23 PM
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్(Jagdeep Dhankhar) తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తూ.. సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖను సమర్పించారు. కాగా, 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ బాధ్యతలు చేపట్టారు. 74 ఏళ్ల ఆయన వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనా మొదటి రోజే ఈ ప్రకటన చేశారు. "ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు వైద్య సలహాలను పాటించడానికి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం, నేను భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాను.. ఇది వెంటనే అమలులోకి రావాలి" అని ధన్ఖడ్ లేఖలో పేర్కొన్నారు.