21-07-2025 10:34:04 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Actor Pawan Kalyan) నటించిన చారిత్రక చిత్రం 'హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu)' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అనుమతి ఇచ్చింది. ఈ సినిమా తెలంగాణలో ఒక రోజు ముందుగానే విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియర్ షో తో పాటు టికెట్ ధరలను అనుమతించినందున, ఈ నెల 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నారు. టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించారు. జిఎస్‌టి అదనంగా వసూలు చేయబడుతుంది. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. విడుదలైన రోజు నుండి జూలై 27 వరకు రోజుకు ఐదు షోలను ప్రదర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల విషయానికి వస్తే, మల్టీప్లెక్స్‌లలో రూ. 200 (ప్లస్ GST), సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150 (ప్లస్ GST) వరకు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.