21-07-2025 10:11:51 PM
మునిపల్లి: మండల పరిధిలోని చీలపల్లి గ్రామం(Cheelapalli Village)లో సోమవారం నాడు పీర్ల పండుగ ముస్లిం సోదరులు, హిందువులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్లను గ్రామ పురవీదుల గుండా డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లంగా ఉండాలని భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాలకంటి వీరన్న పాటిల్, సురేష్ పాటిల్, చిన్న పాటిల్, ఎండి అప్సర్, మీరాసాబ్, నాగరాజు, ఎండి సాజిద్, ఎం. పాండు, ఎండి ఫెరోజ్, ఎండి ఇమామ్ సాబ్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.