21-07-2025 09:40:13 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో గల శ్రీ మహంకాళి అమ్మవారి రెండవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా డిష్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఫలహార బండి రథోత్సవంలో మాజీమంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, తాజా మాజీ జడ్పీటీసీ, సొసైటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, తాజా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, చేగుంట మండల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు వివిధ గ్రామల అధ్యక్షులు, ఉప అధ్యక్షులు, మండల యూత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల, బూత్ అధ్యక్షులు, వివిధ గ్రామాల యూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.