calender_icon.png 12 August, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం

12-08-2025 01:03:48 AM

- మొక్కలు నాటుతున్న కూలీలకు ఢీకొన్న మినీ ట్రక్కు

- ఒడిశాకు చెందిన ముగ్గురు దుర్మరణం

కీసర, ఆగస్టు 11: మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఓఆర్‌ఆర్‌పై మొక్కలు నాటే పనికోసం ఒడిశా ప్రాంతానికి చెందిన కూలీలు ఇటీవలే విధుల్లో చేరారు.

సోమవారం కీసర వద్ద మొక్కలు నాటుతుండగా వేగంగా వచ్చిన టాటా మినీ ట్రక్కు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాము (30), నారాయణ (22), చెక్ మోహన్ (21) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కీసర పోలీసులు, కుషాయిగూడ ఏసీసీ వెంకట్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి  తరలించారు.