12-08-2025 01:05:10 AM
ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి
మునుగోడు,ఆగస్టు 11 (విజయ క్రాంతి): నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఊరుకోండి గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదేశాలతో చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ధోటి నారాయణ,
మండల పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులతో కలిసి ఆయన నూతన హెల్త్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. పేదలకు నాణ్యమైన చికిత్స అందించేందుకు అవసరాన్ని గుర్తించి, ఎమ్మెల్యే చిరతో హెల్త్ సెంటర్‌కు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఎంపీడీవో విజయభాస్కర్,ఏఈ సతీష్ రెడ్డి,డాక్టర్ నర్మదా,పంచాయతీ సెక్రటరీ గీతా,నడింపల్లీ యాదగిరి,మేడి యాదగిరి,పాల్వాయి చెన్న రెడ్డి,వట్టికోటి శేఖర్,బూడిద లింగయ్య,కుంభం చెన్నారెడ్డి,మిరియాల వెంకన్న,పోగుల ప్రకాష్,ఆరేళ్ల సైదులు,గోపగొని పాపయ్య,బరిగల సైదులు,మదగోని దేవలోకం,భీమగొని స్వామి,నిమ్మల స్వామి,బొడ్డుపల్లి యాదయ్య,బోయపల్లి శంకరయ్య, బోయపల్లి వెంకన్న ,బొడ్డుపల్లి కృష్ణయ్య,బోయపల్లి శ్రీను, బొడ్డుపల్లి నగేష్, కట్లకుంట్ల వెంకన్న ,రామస్వామి, కనకయ్య ఉన్నారు.