11-01-2026 03:28:04 PM
రెబ్బెన,(విజయక్రాంతి): డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని నవేగాం గ్రామంలో ఏర్పాటుచేసిన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఆదర్శనీయమని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల దేశ పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు లభించాయని చెప్పారు. ఆయన ఆశయాలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి గౌరవప్రదమైన జీవితం గడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, భారతీయ బౌద్ధ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.