calender_icon.png 11 January, 2026 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి పోటీలకు గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థినిలు

11-01-2026 03:34:25 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఖాజీపేట పట్టణంలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న 58వ జాతీయ స్థాయి సీనియర్ పురుషులు, మహిళల ఖోఖో పోటీలకు ఆసిఫాబాద్‌లోని గిరిజన క్రీడా పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినిలు ఎంపికయ్యారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జంగు బాయి, నాగేశ్వరి, సత్యశీల, శ్రీలతలు జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు బండ మీనా రెడ్డి తెలిపారు.ఎంపికైన క్రీడాకారిణిలను, వారికి శిక్షణ అందిస్తున్న ఖో ఖో శిక్షకుడు వాసం తిరుమల్ ను ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ మర్మాట్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి , ఏసీఎంఓ ఉద్దవ్, క్రీడల అధికారి మడవి షేకు, జీసీడీఓ శకుంతల, ఏటీడీఓ శివకృష్ణ, హెచ్‌డబ్ల్యువో సాయి బాబా, పాఠశాల ఉపాధ్యాయుడు జంగు, శిక్షకులు అరవింద్, విద్యాసాగర్, పాఠశాల అధ్యాపక బృందం పాల్గొని క్రీడాకారిణిలను అభినందించారు.