10-01-2026 01:10:35 AM
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి) : రాష్ర్ట ప్రభుత్వం సీరియల్ కిల్లర్ల మాదిరి.. సీరియల్ ల్యాండ్ స్నాచర్‌గా మారిందని, అన్ని యూనివర్సిటీ భూములను గుంజుకోవడమే పనిగా పెట్టుకుం దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో శుక్రవారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ సమావేశమ య్యారు. 50 ఎకరాల ఉర్దూ యూనివర్సిటీ భూమిని రాష్ర్ట ప్రభుత్వం అక్రమం గా స్వాధీనం చేసుకోవడం పైన విద్యార్థు లు కేటీఆర్‌తో చర్చించారు.
ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని, విశిష్టమైన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కాంగ్రెస్ వాడాలనుకుం టుందని ఆరోపించారు. ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు పేరిట తీసుకున్నదని, 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నం చేసిందన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీ భూమిపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, ఇక్కడి కాంగ్రెస్ రాష్ర్ట ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిందని, కానీ విద్యార్థుల ఆందోళన, ప్రజల వ్యతిరేకత, సుప్రీంకోర్టు జోక్యం వలన తాత్కాలికంగా ఆగిందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ మి వ్యవహారంలో పదివేల కోట్ల భూమి కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పి నా ఇప్పటిదాకా కేంద్రం ఎలాంటి విచారణ చేపట్టలేదని విమర్శించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవ హరించి ఉంటే రాష్ర్ట ప్రభుత్వం ఇప్పుడు మరో సెంట్రల్ యూనివర్సిటీ అయిన ఉర్దూ యూనివర్సిటీ భూములపైన కన్ను వేసేది కాదన్నారు. ఈ ప్రభుత్వం విద్యాసంస్థల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థు లకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
రాబోయే మా ప్రభుత్వంలో యూని వర్సిటీ విస్తరణ కోసం అవసరమైన నిధులను రాష్ర్ట ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల పోరాటానికి అం డగా ఉంటామని, అవసరమైతే ఉర్దూ యూ నివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిన అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ అంశాన్ని అవసరమైతే రాజ్యసభలో మా పార్టీ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతారని తెలిపారు.
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఐఎస్‌బీ భూములను కూడా గుంజుకునే కుట్ర మొదలుపెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో మైనార్టీల సంరక్షకుడిని అని చెప్పుకునే రాహుల్ గాంధీ ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమే కాపాడడమా అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న మైనార్టీ విద్యార్థుల యూనివర్సిటీని నిర్వీర్యం చేయడమే మీ సంరక్షణనా రాహు ల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు.
రాహుల్ గాంధీ మొహబ్బత్‌కి దుకాణం అని చెప్తున్నది ఇదేనా, విద్యార్థులను వారి భూ ములను తీసుకొని రోడ్డుమీద వేయడమేనా అని నిలదీశారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న సమస్యల పైన రాహుల్ గాంధీ మాట్లాడాలి కానీ వారి భూములు గుంజుకుంటున్న తమ ప్రభుత్వం పైన స్పందించకపోవడం దారుణమన్నారు. యూనివర్సిటీలో ఉన్న భూములు ఖాళీ ఉన్నవి కావు భవిష్యత్తు విస్తరణ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. గతంలో ఇదే యూనివర్సిటీ ప్రజా అవసరాల కోసం హైదరాబాద్ నగరం కోసం 32 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఇచ్చారని, కాజాగూడ నుంచి నానక్‌రామ్‌గూడకు లింక్ రోడ్డు కోసం ఏడెకరాల స్థలాన్ని యూ నివర్సిటీ భూమి ఇచ్చినట్టు గుర్తుచేశారు.
నిరుద్యోగుల సమస్యపై స్పందించాలి..
గతంలో తెలంగాణలో జరిగిన ఉద్యమం వల్లనే హైదరాబాదులో హైదరాబాద్ సెంట్ర ల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పడిందని, తెలంగాణ ఉద్యమాలు త్యాగలా ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీని రియ ల్ ఎస్టేట్ కోసం వాడడం దారుణమని మం డిపడ్డారు. గతంలో మేము నిజాం కాలేజీలో హాస్టల్ లేదు అంటే ప్రభుత్వ నిధులతో హాస్ట ల్ కట్టించామని గుర్తు చేశారు. ఇటీవల నిరుద్యోగులు, విద్యార్థులపైన జరిగిన లాఠీఛా ర్జ్‌ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
నోటిఫికేషన్లు ఏవి అని నిలదీసినందుకు వారిని దారుణంగా తిడుతూ, ఘోరంగా లాఠీఛార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇష్టమని చెప్పి ఎందుకు రాహు ల్ గాంధీ ఫోజు కొట్టారని, రాహుల్ గాంధీ విద్యార్థులతో మాటముచ్చట పెట్టి ఉద్యోగాల పేరుతో మోసంచేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశం పైన స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు విద్యార్థుల పైన పోలీసులతో దాడులుచేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో బట్టలదుకాణం, సినిమా థియేటర్ ప్రారంభోత్స వానికి రేవంత్‌రెడ్డి పోతున్నాడని విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషనులు తిప్పు తున్నారని, నిన్నటినుంచి ఆరేడు పోలీస్ స్టేషన్లు తిప్పి విద్యార్థులను, నిరుద్యోగ యువకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు, యు వత వెంట మా పార్టీ తరఫున పండగ నిలబడతామని, మా విద్యార్థి విభాగం వారికి అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.