11-01-2026 03:37:53 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్కొక్కటిగా రోజుకో ముందడుగుగా గ్రామ అభివృద్ధిలో భాగంగా పడమటి ఎర్రగుంట ఆలుగు ముందు గత కొన్ని సంవత్సరాల నుండి నిర్మాణస్యంగా, శిథిలావస్థలో ఉన్న డ్రైనేజీని జెసిబి సహాయంతో ఆదివారం పనులు ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ 8 వ,7వ వార్డు సభ్యులు బింగి వెంకటేశ్వర్లు, బైరు చిరంజీవి లు డ్రైనేజీ సమస్యను తమ దృష్టికి తీసుకురాగా వెంటనే జెసిబి తో పని ప్రారంభించి సమస్యకు పరిష్కార మార్గం చూపించడం జరిగింది.
రాబోయే కొద్ది రోజుల్లో వార్డులలో ఉన్న డ్రైనేజీ సమస్యలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని రాబోయే ఐదు సంవత్సరాలలో అన్నారం గ్రామాభివృద్ధికి పాలకవర్గ సభ్యుల గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తామని గ్రామ అభివృద్ధిలో రాజకీయాలకతీతంగా యువత ముందుకు వచ్చి సమస్యల్లో పాలుపంచుకొని సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచనప్రాయంగా తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు పొన్నాల సృజన్, బైరు ప్రదీప్, చర్లపల్లి త్రిలోక్, మాణిక్యం, కల్కూరి సన్నీ, దాసరి రమేష్ బ్రదర్స్ ,జాగటి రవి , బింగి సురేష్, సిద్దు లు పాల్గొన్నారు.