11-01-2026 03:31:14 PM
జైనూర్,(విజయక్రాంతి): జైనూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ మహమ్మద్ పాజిల్ బియాబానీ ఆదివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన కాంట్రాక్టర్‌గా, సమాజ పెద్దగా గుర్తింపు పొందుతూ అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని స్థానికులు తెలిపారు.
ఆయన మృతివార్త తెలుసుకున్న వెంటనే మండల కేంద్రంలోని ఆయన నివాసానికి రాజకీయ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకొని మృతదేహానికి నివాళులు అర్పించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, వ్యాపారులు కూడా విచారం వ్యక్తం చేశారు. పాజిల్ బియాబానీ మృతికి సంతాప సూచకంగా జైనూర్ మండల కేంద్రంలోని అన్ని వర్గాల వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.