11-01-2026 03:41:59 PM
మంత్రి కోమటరెడ్డిపై అసత్య ప్రచారాలను చేసుతున్న టీవీ చానల్స్ ను తెలంగాణ నుండి బహిష్కరించాలి
మునుగోడు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ చానల్స్,పత్రికలను తెలంగాణ నుండి బహిష్కరించాలని రత్తిపల్లి మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్ అన్నారు. మంత్రిపై, మహిళ కలెక్టర్లపై అసత్య ప్రచారాను ఆయన ఖండించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో మంత్రి పదవిని సైతం త్యాగం చేసి తెలంగాణ రావడంలో కీలకపాత్ర పోషించి, నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడడానికి కారుకులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కొన్ని టీవీ ఛానల్ లో పత్రికలు కొన్ని రాజకీయ పార్టీ నాయకుల అండతో చేస్తున్న విచప్రచారం చేసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజలకు అండగా ఉంటూ, పెద విద్యార్థులను చదివిస్తూ , ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలను అందిస్తూన్నారని అన్నారు.నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తిని కించపరిచే విధంగా ప్రచారం చేస్తున్న కొన్ని ఛానల్లను తెలంగాణ నుంచి బహిష్కరించాలని వాటి ప్రసారాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉన్నత చదువులు చదివి జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్న మహిళల మీద కూడా ఇలాంటి విష ప్రచారాలు చేస్తుంటే, ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి అసత్య ప్రచారం చేస్తున్న టీవీ న్యూస్ చానల్స్ , పత్రికల ప్రసారాలను నిలిపివేయాలని అన్నారు.