11-10-2025 12:36:31 AM
ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): తక్కువ పెట్టుబడితో అధిక లాభా లు ఇస్తామని ఆశ చూపే వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెటా ఫండ్ ప్రో పేరుతో గొలుసు కట్టు వ్యాపారం చేసి ప్రజలను మో సం చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసారు. వివరాలను జిల్లా ఎస్పీ అశోక్ కు మార్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
జగిత్యాల పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ కస్తూరి రాకేష్ కుమార్, కొడిమ్యాలకు చెందిన సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, వీరబత్తిని రాజు అనే నిందితులు మెటా ఫండ్ ప్రో అనే యాప్ ను తయారుచేసి ఒక లక్ష రూపాయ లు పెట్టుబడి పెడితే మూడు లక్షల రూపాయలు వస్తాయని, ఎక్కువ మందిని జాయి న్ చేయిస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని, విధేశీ యాత్రలు కూడా ఉచితంగా చేయవచ్చని గొలుసుకట్టు వ్యాపారం పేరు తో ప్రజలను మోసగించారని తెలిపారు.
జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేష్ కుమార్, కొ డిమ్యాల కు చెందిన తిరుపతిరెడ్డి, రాజు లు కలిసి అమాయక ప్రజల నుండి డబ్బులు వసూల్ చేసారన్నారు. ఈ డబ్బులను క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తం లో లా బాలను పొందవచ్చని మూకుమ్మడిగా కొడిమ్యాలకు చేంధిన ముగ్గురు వద్ద సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేసి వారికి మూడింతల లాభం వస్తుందని, గోవా, సిం గపూర్, దుబాయ్ వంటి దేశాలకు ఉచితం గా టూర్ పంపిస్తామని ఆశ చూపి ఎటువంటి డబ్బులు వారికి ఇవ్వకుండ మోసం చేశారని ఎస్పీ తెలిపారు.
మెటా ఫండ్ ప్రో అనే యాప్ ని కూడ క్లోజ్ చేయగా, పెట్టుబడి పెట్టిన అనేక మంది బాధితులు నష్ట పోయారని తెలిపారు. కొడిమ్యాల కు చెంది న బాధితురాలి పిర్యాదు మేరకు కొడిమ్యాల పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు న మోదు చేసి తిరుపతిరెడ్డి, రాజు లను ఈనెల 8న అరెస్టు చేసి కోర్టు పంపించామని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రధాన నిందితుడైన కస్తూరి రాకేష్ కుమార్ ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.
తదుపరి విచారణ కొనసాగుతుందని బాధ్యులైన వ్యక్తులను ప ట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అరెస్టు సమయంలో రాకేష్ కుమార్ నుండి లాప్టాప్, ఒక లక్ష రూపాయలు నగదు, బ్యాంకు పా సుబుక్కులు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డు లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ప్రజలు గొలుసు కట్టు వ్యాపారం పేరుతో క్రిప్టో కరె న్సీ లో ఇన్వెస్ట్ చేసి అధిక మొత్తంలో లాబాలను అందిస్తామని, విదేశీ టూర్లకు పంపి స్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈ మీడియా సమావేశంలో డిఎస్పి రఘు చం దర్, మల్యాల సి.ఐ రవి, కొడిమ్యాల ఎస్త్స్ర సందీప్ లు ఉన్నారు.