11-10-2025 12:35:13 AM
ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అక్టోబర్ 10 (విజయక్రాంతి) : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులతో పాటు ప్రధాన ప్రజా సమస్యలపై జిల్లా అభివృద్ధికి కావలసిన నిధుల గురించి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ ప్రజల అభివృద్ధి కోసం ప్రతిపాదనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటుందని ధన్పాల్ సూ ర్యనారాయణకు ముఖ్యమంత్రి హామీ ఇ చ్చారు.
సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి పనుల అంచనాల వ్యయం నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించవలసిందిగా శుక్రవారం ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. హౌసింగ్ ఇందిరమ్మ ఇండ్ల వరకు పథకం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూ రు చేయాల్సిందిగా తన విజ్ఞాపన పత్రంలో ఆయన కోరారు నిజామాబాద్ అర్బన్ ల్యాండ్ కొరత వల్ల కేవలం ఒక వెయ్యి 1753 మంజూరు అయ్యాయని లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు.
సి డి పి రెండు సంవత్సరాలు గడుస్తున్న నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల కాలేదని త్వరగా ఈ నిధులు విడుదల చేయాలని కోరారు నియోజకవర్గంలో ఎఫ్డిసి నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం పది కోట్లు రూపాయలతో స్పెషల్ డెవలప్మెంట్ పండ్లతో పాటు మున్సిపల్ అభివృద్ధి నియోజకవర్గంలోని పార్కులు రోడ్లు జంక్షన్ల అభివృద్ధి పనుల కోసం రూ: 99.78 కోట్ల ప్రణాళిక సిద్ధం చేసి పనుల జాబితాను నిధుల విడుదలకై ముఖ్యమంత్రికి ఆయన అందజేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో ఆధునిక సౌకర్యాలతో మౌలిక వసతులు అభివృద్ధికి నిధులు కేటాయిటాయించడంతోపాటు ఐటీ హబ్ లో కాళీ పోస్టులను భర్తీ చేసి ప్రఖ్యాతిగాంచిన కంపెనీలను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించిన విజ్ఞాపన పత్రంలో సూర్యనారాయణ కోరారు.