15-11-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట రూరల్, నవంబర్ 14: దాన్యం కోనుగోలు సెంటర్ లలో అన్ని వసతులు కల్పించాలని, కొనుగోలులో జాప్యం జరగొద్దని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో శుక్రవారం పర్యటించారు. ఐకేపి సెంటర్ లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. తేమశాతం రాగానే గన్నీలలో నింపి లారీలలో లోడ్ చేయించాలని సెంటర్ సిబ్బందిని ఆదేశించారు.
రోజు రెండు లారీల చొప్పున రామంచ గ్రామ హనుమాన్ మిల్ కు ధాన్యం పంపిస్తున్నామని సెంటర్ సిబ్బంది కలెక్టర్ కి తెలుపగా, కోనుగోలులో వేగం పెంచాలని కలెక్టర్ సూచించారు. గుర్రాలగొంది జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూర నాణ్యత మెరుగుపరచాలని, రుచికరంగా వండాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేసారు. మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డి డ్రై డే కి వెళ్లారని, హెల్త్ సూపర్వైజర్లూ సునీత, సుధారాణి ఫీల్ కి వెళ్లినట్లు సిబ్బంది తెలపగా ఆరా తీయాలని ఎమ్మార్వోను ఆదేశించారు. మొక్కుబడిగా ఓపి రిజిస్టర్ రాస్తూ, ఫీల్డ్, మీటింగ్స్ పేరుతో విధులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారినీ ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందివ్వడం కోసం తరుచు పి ఎచ్ సి ని పర్యవేక్షణ చెయ్యాలని ఎమ్మార్వో ను ఆదేశించారు.