03-05-2025 01:16:52 AM
కరీంనగర్, మే2 (విజయ క్రాంతి): నగరంలోని కోతి రాంపూర్ లోని అచీవర్స్ యాక్టివ్ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పదవతరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఇందులో విద్యార్థిని, విద్యార్థులు ప్రథమ శ్రేణి లో వంద శాతం ఉత్తీర్ణతో ముందు వరసలో నిలిచారు.
ఈ ఫలితాలలో 31 మంది విద్యార్థులలో 22 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించా రని పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందులో ఇద్దరు విద్యార్థినులు 572 మార్కులు, నలుగురు విద్యార్థులు 550 మార్కులు సాధించాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ పల్లవి, ఉపాధ్యాయులు అభినందించారు.