15-08-2025 06:23:26 PM
సంజీవ్‌రెడ్డి నగర్: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం సంజీవ్‌రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఎస్.వి. రాఘవేంద్ర రావు, ఎస్హెచ్ఓ శ్రీనాథ్ రెడ్డి పాల్గొని రెపరెపలాడే మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావులను స్మరించుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా సమాజం అభివృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్హెచ్ఓ మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.