15-08-2025 06:17:29 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉత్తమ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మద్నూర్ తహశీల్దార్ ఎండీ ముజీబ్ జిల్లా ఉత్తమ తహశీల్దార్ గా ముఖ్య అతిథి కోదండ రెడ్డి, కలెక్టర్ అశీష్ సాంగ్వాన్ చేతులు మీదుగా అవార్డును అందుకున్నారు.ఉత్తమ ప్రతిభ చూపినందుకు తాసిల్దార్ ఎండి ముజిబ్ కు తహసీల్ కార్యాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.