3 April, 2026 | 7:31 AM

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ లక్ష్మీనారాయణ

10-02-2026 02:02 PM

మున్సిపల్ ఎన్నికల కోసం  సర్వం సిద్ధం

ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 53, 403 ఓటర్లు 

 76 పోలింగ్ బూతులు

షాద్‌నగర్,(విజయక్రాంతి): షాద్ నగర్ లో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని విధి నిర్వహణకు తరలుతున్నారు.జిల్లా ఎన్నికల అథారిటీ అధికారి, మున్సిపల్ కమిషనర్ సునీతా రెడ్డి ఆధ్వర్యంలో విధుల కేటాయింపు జరిగింది. 28 వార్డులకు సంబంధించి 53, 403 ఓటర్లకు గాను 76 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు  చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్నికల అధికారిని సునీతా రెడ్డి తెలిపారు.

300 మందికి పైగా పీవోలు, ఏపీవోలు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆర్డీవో సరిత సమక్షంలో విధుల కేటాయింపులు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బంది బాక్సులు తీసుకొని ఎన్నికల విధినిర్వాహణకు సమాయత్తమయ్యారు. మరోవైపు పోలీసులు కూడా 28 వార్డుల్లోనూ భారీ బందోబస్తుకు ఏర్పాటు చేస్తున్నారు. డిసిపి శిరీష ఆధ్వర్యంలో 200 మందికి పైగా పోలీసులు వార్డుల వద్ద బందోబస్తు నిర్వహించనున్నారు.

మున్సిపాలిటీలో సమస్యాత్మక వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మున్సిపాలిటీలో ఆరు వార్డులను సమస్య సమస్యాత్మక వార్డులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను బందోబస్తును స్థానిక ఎసిపి లక్ష్మీనారాయణ మంగళవారం ఉదయం పరిశీలించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారుల సూచనల మేరకు స్థానిక అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.