01-08-2025 12:17:46 AM
నిజామాబాద్ జులై 31 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ ఎసిపి రాజా వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లోని పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల పట్టుబడిన వాహనాలు అదుపులోకి తీసుకున్న వాహనాలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్లోని రిజిస్టర్ రికార్డు రూము రైటర్ రూములను తనిఖీ చేసి ప్లాంటేషన్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. తానాకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరించాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరనికి సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.
భవిష్యత్తులో జరగనున్న స్థానిక ఎన్నికల దృశ్య ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కట్టుదితంగా వ్యవహరించి శాంతి భద్రతల పరిరక్షణ పాటుపడాలను సిబ్బందిని ఆదేశించారు. ఆన్లైన్ బెట్టింగ్ మత్తు పదార్థాల అక్రమ రవాణా ఇసుక మొహం రావణ అక్రమ బియ్యం రావణ తదితర అంశాలపై గట్టి నిగా పెట్టి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.